![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -27 లో.... కిన్నెర స్కూల్ దగ్గర ఒక అమ్మాయి వాళ్ళ నాన్నతో కలిసి ఉండడం చూసి ఏడుస్తుంది. అది గమనించిన జానూ తనని ఓదార్చలేకపోతుంది.అప్పుడే సూర్యకి జాను ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. సూర్య తన మాటలతో తనని డైవర్ట్ చేస్తాడు. దాంతో కిన్నెర నవ్వుతుంది. చాలా థాంక్స్ సూర్య.. నాకు అన్ని విషయాలలో సపోర్ట్ చేస్తావా అని జానూ అడుగుతుంది. దానికి సూర్య సరే అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. దాంతో సూర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత మురళి అసిస్టెంట్ నందు పెళ్లి క్యాన్సిల్ అయింది కదా ఇక మళ్ళీ మురళికి ఇచ్చి పెళ్లి చేస్తారని మళ్ళీ ఫ్లెక్సీ ఫోటోస్ షాప్ ముందు పెడుతుంటే మురళి వచ్చి తనపై కోప్పడతాడు. అప్పుడే సూర్య వస్తాడు. జానూ షేక్ హ్యాండ్ ఇచ్చిందని ఆ హ్యాండ్ కి మురళి షాప్ లో ఉన్న పెయింట్ లో పెట్టి గోడకి పెడతాడు. ఎందుకు అలా చేసావని మురళి అడుగుతాడు. మొదటిసారి జానూ షేక్ హ్యాండ్ ఇచ్చింది.. ఆ గుర్తు ఉండాలని అలా చేశానని సూర్య అంటాడు. ఆల్రెడీ ప్రేమలో పడి మా మురళి ఎలా అయ్యాడో చూడు.. మళ్ళీ నువ్వు ప్రేమ అంటున్నావ్.. ఏంటని సూర్యతో మురళి అసిస్టెంట్ అంటాడు. ఆ తర్వాత పెళ్లి సంగతి ఏమైందో ఏంటో అని నందు తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. అప్పుడే కిన్నెర స్కూల్ నుంచి సంతోషంగా వస్తుంది. పోయేటప్పుడు డల్ గా పోయావ్ ఇప్పుడు సంతోషంగా ఉన్నావని శారదా అడుగుతుంది.
దాంతో జానూ జరిగింది చెప్తుంది. ఆ తర్వాత సింహాద్రి వస్తాడు. పర్లేదు అందరు బానే ఉన్నారని అనుకుంటాడు. తన వెనకాలే భువన వచ్చి శంకర్ ఫోటో దగ్గర దండ పెట్టి మొక్కుతుంది. మీకు ఏం అవసరమున్నా.. మా ఇంటికి రండి అని భువన చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్లిపోతుంటే మావయ్య అబ్బాయి వాళ్ళు పెళ్లి గురించి నీతో ఏమైనా అన్నారా అని సింహాద్రిని నందు అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకని శారద అంటుంది. పర్లేదులే శుభం జరగాలి ఇంట్లో అని పెద్దావిడ అంటుంది. సరే కనుక్కుంటానని సింహాద్రి అంటాడు. ఆ తర్వాత భువన వెళ్తు.. నువ్వు ఒక్కదానివే అనుకున్నాను.. ఇంట్లో అందరు అలాగే ఉన్నారని జానూతో అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |